వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిట్ డైరెక్టర్ రాజీనామా డ్రామా ఏమౌతుంది?

By Santaram
|
Google Oneindia TeluguNews

YV Rao
వరంగల్: దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్‌ విద్యను అందించే విద్యా సంస్థల్లో ఒక్కటైన వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ వైవి రావు బుధవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. నిట్‌లో వివిధ అంశాలకు సంబంధించి వైవి రావు 60 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విషయాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఆ విషయమై గత నాలుగు రోజులుగా నిట్‌ క్యాంపస్ ‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా నిట్‌ క్యాంపస్‌లో విద్యా ర్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి డాక్టర్‌ రాజీనామా చేయాలని పట్టుబట్టారు.

కానీ రాత్రి వైవీరావు దీనిపై భిన్నంగా స్పందించారు. తాను రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఛాతినొప్పి, రక్తపోటుతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లాడారు. 'సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశాం. అందులో విద్యార్థులు 40 నిమిషాల పాటు సమస్యల మీద చర్చించారు. ఆ తరువాత నన్ను రాజీనామా చేయమని పట్టుబట్టారు. వారు రాసుకొని వచ్చిన కాగితం మీద సంతకం పెట్టాను. అది రాజీనామా కాదు. వారు ఒత్తిడి చేశారు కాబట్టే నేను సంతకం పెట్టాల్సి వచ్చింది' అని చెప్పారు.

చివరకు విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని నిట్‌ రిజిస్ట్రార్‌ సిఎ స్‌పి రావుకు అందజేశారు. దాన్ని విద్యార్థులు లాక్కొని అందరికి చదివి వినిపించారు. అయితే ఆ రాజీనామాను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతు న్నారు. ఇదిలా ఉండగా ఆ అవినీతి కుంభకోణంలో భాగస్వామ్యంతో పాటు రిజిస్ట్రార్‌ పదవి నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నుండి నియమించ బడ్డ వ్యక్తి అనర్హుడని, నిట్‌ రిజిస్ట్రార్‌ పిఎస్‌పి రావు కూడా రాజీ నామా చేయాలని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాజీపేట, సుబేదారి ఎస్‌ఐలు బి.నందీరామ్‌ నాయక్‌, సతీష్‌బాబులు పోలీసు బలగాలైన రోప్ ‌పార్టీలు, డిస్ట్రిక్‌ గార్డులు, సివిల్‌, ఎఆర్‌ పోలీసులు నిట్‌కు చేరుకుని భారీ బందోబస్తు నిర్వహించారు.

అటు విద్యా ర్థుల ఆందోళనలు, ఇటు నిట్‌ డైరెక్టర్‌ రాజీనామా, మరో వైపు పోలీసుల మోహరింపుతో ఒక దశ లో నిట్‌లో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి, ఉద్రిక్తత నెలకొంది. దాదాపు ఐదు గంటల పాటు ఈ తతంగమంతా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రింట్‌, అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడి యాలకు చెందిన ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఆ ఆందోళన, నిట్‌ డైరెక్టర్‌ రాజీ నామాకు దారితీసిన పరిస్థితులను ప్రత్యక్షప్రసారాలు చేశారు. నిట్‌ డైరెక్టర్‌ వైవి రావు రాజీనామా అనంతరం నిట్‌ క్యాంపస్‌లో అటు విద్యార్థులు, ఇటు ఉద్యోగులు కేరింతలు వేసి ఆనందోత్స వా లు జరుపుకున్నారు. మోటారు సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సంఘటనలతో క్యాంపస్‌ అంతా సందడిగా మారింది. నిట్‌ డైరెక్టర్‌ రాజీనామా చేయాలని ఆందోళన...60 కోట్ల రూపాయాల కుంభకోణానికి ప్రధాన పాత్రదారి అయిన జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌) డైరెక్టర్‌ వైవి రావు తన పదవికి రాజీనామా చేయాలని గత నాలుగు రోజులుగా విద్యార్థులు ఆందోళనలను తీవ్రతరం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X