హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లు అర్జున్ వరుడు సినీ ప్రదర్శనకు బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Arjun
హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన సినిమా ప్రదర్శనకు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో తెలంగాణవాదులు అడ్డు తగిలారు. సినీ ప్రదర్శనను అడ్డుకున్నారు. వరుడు సినిమా ప్రదర్శిస్తున్న రాజేష్ థియేటర్ వద్ద తెలంగాణవాదులు ఆందోళనకుగు దిగారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మేనల్లుడు అయిన వరుడు సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు.

చిరంజీవి తెలంగాణకు మద్దతు పలకాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరుడు సినిమా ప్రదర్శనను అడ్డుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వివరాలు అందాల్సి ఉంది. అల్లు అర్జున్ వరుడు సినిమా భారీ అంచనాలతో బుధవారం విడుదలైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X