హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సినిమా కాబట్టే వీర తెలంగాణను అడ్డుకుంటున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Veera Telangana
హైదరాబాద్: వీర తెలంగాణను సినిమా విడుదలను కావాలనే అడ్డుకుంటున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలంగాణ సినిమా కాబట్టి థియేటర్లు లభించకుండా చేసి అడ్డుకుంటున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంగా ఈ సినిమాను ఆర్ నారాయణ మూర్తి నిర్మించారు. ఆ సినిమాకు నిర్మాత, దర్శకుడు ఆయనే. ప్రధాన పాత్రను కూడా ఆయన పోషించారు. ఆంధ్ర సీడెడ్ లోనే కాదు, నైజాంలోనూ వీర తెలంగాణ సినిమాకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ సినిమా కావడం వల్లనే తన సినిమాను అడ్డుకుంటున్నారని నారాయణమూర్తి చెప్పడం లేదు. డబ్బింగ్ సినిమాల వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.

నైజాం సీడెడ్ గా పిలిచే తెలంగాణలోని థియేటర్లు 18 మంది చేతుల్లో ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన నలుగురైదుగురు వీర తెలంగాణ సినిమాకే కాదు, మరి కొంత మంది సినిమాలకు కూడా థియేటర్లు దొరకకుండా చేస్తున్నారనే విమర్శ ఉంది. ఈ విషయంలో ఇది వరకు ఓసారి ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కూడా నిప్పులు చెరిగారు. అయితే, సినిమా వ్యాపారమని, కనీస లాభాలు కూడా రాని సినిమాలను ప్రదర్శించడం వల్ల నష్టపోతారని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. వీర తెలంగాణకు థియేటర్లు దొరకకపోవడం తెలంగాణ సినిమా కావడం వల్లనే అనేది నిజం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X