హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్త చరిత్ర -2పై సూరి హ్యాపీ, పరిటాల సునీత పెదవి విరుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha-Maddelacheruvu Suri
బెంగళూర్/హైదరాబాద్‌: రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర -2 అనుకున్నట్లుగానే ఉంది. అందుకే రక్తచరిత్ర -1పై చెలరేగినంత వివాదం రెండో భాగంపై చెలరేగలేదు. రక్తచరిత్ర -2లో పరిటాల రవి కేసు నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరిని హీరోగా చూపించినట్లే ఉన్నారు. ఈ సినిమాపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బెంగుళూర్ లో ఆయన ప్రివ్యూ చూశారు. సినిమాకు తాను డబ్బులు పెట్టలేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. రక్త చరిత్ర -1లో ఏదో మేరకు పరిటాల రవిని హీరోగా చూపించారు కదా, తాను డబ్బులు పెడితే పరిటాల రవిని హీరోగా ఎలా చూపిస్తారని ఆయన అన్నారు.

తాను రాజకీయాల్లోకి ఇప్పుడే ప్రవేశించబోనని ఆయన చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించే ఆలోచన చేస్తానని ఆయన చెప్పారు. కాగా, రక్తచరిత్ర -2పై పరిటాల రవి భార్య, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత పెదవి విరిచారు. తాను సినిమాను చూడదలుచుకోలేదని ఆమె చెప్పారు. వర్మ సినిమాలో అవాస్తవాలను వాస్తవాలుగా చూపించారని, ఈ మేరకు తనకు మెసేజ్ లు వస్తున్నాయని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X