హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కందిరీగ షూటింగ్ లో వివాదానికి కారణమైన ఫైటర్స్ పై వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
హైదరాబాద్: తెలుగు, తమిళ ఫైటర్స్ మధ్య నెలకొన్న వివాదం దృష్ట్యా గత పక్షం రోజులుగా ఎక్కడికక్కడే ఆగిపోయిన చిత్ర పరిశ్రమ వివాదం ఓ కొలిక్కి రానుంది. కందిరీగ చిత్రంలో తెలుగు, తమిళ ఫైటర్స్ కొట్టుకున్న నేపథ్యంలో ఈ వివాదం దారితీసిన విషయం తెలిసిందే. అప్పటినుండి పరిశ్రమలోని అన్ని చిత్రాలు ఆగిపోయాయి. కాగా ఆదివారం రోజు దర్శకరత్న దాసరి నారాయణరావుతో ఆల్ ఇండియా ఫిలిం డెవలప్ మెంటు కార్పోరేషన్ (ఏఐఎఫ్డీసి) జరిపిన చర్చలు అనంతరం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

గొడవకు కారణమైన తమిళ స్టంట్ మాస్టర్ శివ ఈ రోజు నుండి జనవరి 2వ తేది వరకు దేశవ్యాప్తంగా ఎలాంటి షూటింగులకు హాజరు కావద్దని ఆదేశించారు. శివతో పాటు గొడవకు కారణమైన మరో నలుగురిపై కూడా వేటు వేశారు. దీంతో వివాదం సద్దుమణిగి మళ్లీ చిత్రాల షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X