ఆల్ ఖైదా కొత్త చీఫ్ జవహరి, ఉగ్రవాద సంబంధ వెబ్‌సైట్ వెల్లడి

గురువారం, జూన్ 16, 2011, 14:01 [IST]
Ayman Al-Zawahiri
కైరో: అమెరికా దాడిలో హతమైన ఒసామా బిన్ లాడెన్ స్థానంలో ఆల్ ఖైదా చీఫ్‌గా ఈజిప్టులో పుట్టిన ఆయమాన్ ఆల్ జవహరి నియామకం జరిగినట్లు ఆల్ ఖైదాకు చెందిన వెబ్‌సైట్‌లో వార్త వెలువడింది. లాడెన్ గత నెలలో పాకిస్తాన్‌లోని అబొత్తాబాద్‌లో అమెరికా కమెండోల దాడిలో మరణించిన విషయం తెలిసిందే. ఆల్ ఖైదాలో రెండో స్థానంలో ఉన్న జవహరి ఇప్పుడు లాడెన్ స్థానంలో చీఫ్‌గా నియమితుడయ్యాడు.

వచ్చే వారంలో అరవై ఏళ్ల పడిలో పడుతున్న జవహరి వైద్యులు, పండితులు గల ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి కైరో విశ్వవిద్యాలయం వైద్య పాఠశాలలో ఫార్మకోలజీ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ప్రధానమైన మత అధ్యయనం కేంద్రం ఆల్ అజర్ విశ్వవిద్యాలయంలో తాత గ్రాండ్ ఇమామ్‌గా పనిచేశాడు. జవహరి నియామకానికి సంబంధించిన సమాచారాన్ని ఆల్ ఖైదా వైబ్‌సైట్ గురువారం పోస్టు చేసింది.
English summary
An al-Qaida affiliated website says Egypt-born Ayman al-Zawahri has succeeded Osama bin Laden as head of the terror network.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets