గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరం నిద్రపోతున్న వేళపై జగన్ వర్గం ఫైర్, దాడులకు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagaram Nidra Potunna Vela
గుంటూరు: నగరం నిద్రపోతున్న వేళ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై వైయస్ జగన్ ఇటీవలె స్థాపించిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి సేన కార్యకర్తలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై కొన్ని అవాస్తవ సన్నివేశాలు ఉన్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ థియేటర్ ముందు వైయస్ఆర్ పార్టీ విద్యార్థి సేన సోమవారం ఆందోళన చేపట్టింది. వైయస్ పాదయాత్రను వక్రీకరించారని వారు ఆరోపించారు.

చిత్రంలో వక్రీకరించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ చిత్రం ప్రదర్శించే థియేటర్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. కాగా నగరం నిద్రపోతున్న వేళ చిత్రం గత శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు, చార్మి ప్రధాన పాత్రలలో నటించారు. ప్రేంరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

English summary
YSR Congress party making agitation at Nagaram Nidrapothunna Vela theatre in Guntur district today. They demanded to delete YSR padayatra scenes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X