మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంతటితో ఆగవద్దు: అరుంధతీ రాయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arundhati Roy
మెదక్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష న్యాయమైనదని, ప్రజాస్వామి డిమాండ్ అని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ అభిప్రాయపడ్డారు. శనివారం నుండి మెదక్ జిల్లాలో జరిగే మంజీర రచయితల సమావేశానికి రాలేక పోయిన ఆమె లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం వంటి కొన్ని డిమాండ్లు గురుతర బాధ్యతను గుర్తు చేస్తాయని చెప్పారు. అయితే ప్రత్యేక తెలంగాణ స్వప్నం చత్తీస్ ఘడ్, జార్ఘండ్, ఉత్తరాఖండ్‌ల లాగా సామాజిక, ఆర్థిక, పాశవిక అసమానంతల చిన్న రాష్ట్రం కారాదని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త దారి చూపాల్సింది పోయి నదుల్ని, ఆడవులను, కొండల్ని ఒక్క మాటలో చెప్పాలంటే మన సమాజ వనరులన్నింటినీ ప్రైవేటు కంపెనీలకు పాదాక్రాంతం చేయడంలో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతున్నాయని ఆరోపించారు.

ప్రాజెక్టులు, అభివృద్ధి పేరిట దోపిడీని అడ్డుకునే వారిని వేటాడటం జరుగుతున్నదన్నారు. అయితే ఉద్యమాల చరిత్ర, తిరుగుబాటుకు వెనుకంజ వేయని చరిత్ర గల తెలంగాణలో అలా జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరి స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని ఆమె ఆశించారు. సమావేశానికి రాలేక పోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు. మానవ సమాజం తనను తాను ఎలా నిర్వహించుకోవాలో పరిపాలించుకోవాలో చర్చ జరుగుతున్న తరుణంలో మనం తీవ్రమైన పర్యావరణ ప్రమాదాన్ని సృష్టించుకుంటున్నామని అన్నారు. సముద్రాలలో పూర్తిగా చేపలు కనుమరుగయ్యాయని, ప్లాస్టిక్ పెరిగిందని అన్నారు. మన మేథాశక్తి గురించి ఎంత గర్వపడినప్పటికీ మనం ఎంతో ముర్ఖులమని అన్నారు.

ఉత్తర తెలంగాణ, జార్ఘండ్, ఒరిస్సా తదితర ప్రాంతాలలో జరిగే ఘర్షణ నాగరికత, స్వాభావాల మధ్య జరిగే యుద్ధంగా భావిస్తున్నట్లు చెప్పారు. యుద్ధాలకు కారణం రెండు రకాలు. భూమి మీద ఉన్న వాటన్నింటికీ తానే హక్కుదారుడని మానవుడు భావించడం ఒకటి కాగా, రెండోది మొదటి సమాజాన్నే కాకుండా దాని సంస్కృతిని, ఆలోచనను నిర్మిలించి భూ వినాశానికి దారితీసే పెట్టుబడిదారి వర్గ సమాజం అని లేఖలో పేర్కొన్నారు. మన దేశంలో రక్షణ బడ్జెట్ వైద్య, విద్యపై ఖర్చు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

English summary
Well known writer Arundati Roy suggested Telanganites by her letter to Manjeera Rachayitala Sangam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X