రామ్‌దేవ్ హాట్, అంగీకరిస్తే పెళ్లాడుతా: రాఖీ సావంత్

గురువారం, జూలై 28, 2011, 8:12 [IST]
Rakhi Sawant
న్యూఢిల్లీ: యోగా గురు రామ్‌దేవ్ బాబాను పెళ్లాడుతానంటూ బాలీవుడ్‌ శృంగార నటి రాఖీ సావంత్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని రాఖీ సావంత్ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసింది. తాజాగా యోగా గురువు బాబా రాందేవ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇమాజిన్‌ టీవీలో ప్రసారమవనున్న తన రియాలిటీ షో 'గజబ్‌ దేశ్‌ కి అజబ్‌ కహానియా' ప్రచార కార్యక్రమానికి వచ్చిన రాఖీ బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడింది.

''బాబా రాందేవ్‌ అంగీకరించిన రోజు నేను ఆయన్ను పెళ్లాడతా. రానున్న స్వయంవరం కార్యక్రమానికి రాందేవ్‌ను తీసుకురావాలని ఇమాజిన్‌ టీవీని కోరుతున్నా'' అని చెప్పింది. ''చాలా కాలం కిందట రాహుల్‌ను పెళ్లాడదామనుకున్నా, కానీ, ప్రస్తుతం రాందేవ్‌ను మాత్రమే ఇష్టపడుతున్నా'' అని రాఖీ వెల్లడించింది. రాహుల్‌ గాంధీ 'సగం భారతీయుడు' అన్న కత్రినా కైఫ్‌ వ్యాఖ్యలను విమర్శించింది. ఆమె అలా అనడం సరికాదని చెప్పింది.

యోగా గురు రామ్‌దేవ్ బాబాకు గుట్టల కొద్దీ డబ్బులు, ఖరీదైన కార్లున్నాయని, తన పెళ్లి రామ్‌దేవ్‌తో జరిగితే మీరు కొత్త రకం సాధ్వీని చూస్తారని ఆమె అన్నది. రామ్‌దేవ్‌ను బాబా అని సంబోధించడానికి ఆమె నిరాకరించింది. మీలాంటి వ్యక్తులకు ఆయన బాబా అని, తనకైతే స్వామీ అని, రామ్‌దేవ్ తనను సోదరి అని సంబోధించడని తాను నమ్ముతున్నానని రాఖీ సావంత్ అన్నది.
English summary
Rakhi, who had recently declared her desire to tie the knot with Rahul Gandhi, shocked everyone by shifting her allegiance to Baba Ramdev. "Mujhe nahin lagta Soniaji ke saath meri daal galegi. So I wouldn't mind marrying Swami Ramdev.
User Comments
Mangacharyulu 02 Jan 2012 02:03 pm
Rakhi tries to be in news always by some way or other. This is nothing but one more.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets