వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుగుబాటు: యడ్యూరప్ప వెనక 30 మంది ఎమ్మెల్యేలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగుళూరు: బిజెపి అధిష్టానంపై తిరుగుబాటుకే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరుగుబాటుకే సిద్ధపడినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాలనే బిజెపి నాయకత్వం ఆదేశాలను ధిక్కరించేందుకు సిద్దపడిన ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. గురువారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యడ్యూరప్ప సమావేశాలకు ఎవరూ వెళ్లకూడదని, అలా వెళ్తే వేటు తప్పదని బిజెపి అధినాయకత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తూ 30 మంది శాసనసభ్యులు, ఏడుగురు మంత్రులు, ఓ పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్పకు మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది.

తమ ఆదేశాలను ధిక్కరిస్తే వేటు తప్పదని బిజెపి అధిష్టానం యడ్యూరప్పను కూడా ఆదేశించింది. కానీ ఆయన అధిష్టానం మాటను బేఖాతరు చేయాలనే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రేపు శుక్రవారం యడ్యూరప్ప స్థానంలో కొత్త నేత ఎంపికకు బిజెపి అధిష్టానం ముహూర్తం పెట్టింది. ఈశ్వరప్ప లేదా జగదీష్ షెట్టర్‌ల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయాలని బిజెపి అధిష్టానం తొలుత నిర్ణయించింది. అయితే, అకస్మాత్తుగా సదానంద గౌడ పేరు తెర మీదికి వచ్చింది. సదానంద గౌడను ఎంపిక చేస్తే యడ్యూరప్ప వర్గంలోని శాసనసభ్యులు కొంత మంది మద్దతు పలికే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. కానీ, అది సాధ్యమవుతుందా అనేది అనుమానంగానే ఉంది.

English summary
It is said that Karnataka CM Yeddyurappa has decided to revolt against BJP central leadership. It is learnt that 30 MLAs are backing Yeddyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X