ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పశ్చిమంలో కూతురిని అంగీకరించిన ఆంధ్ర తివారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

West Godavari District
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో మరో ఎన్‌డి తివారి బయటపడ్డాడు. అయితే ఇతడు తివారిలా తప్పించుకునే మాటలు చెప్పకుండా నిజాయితీగా తన తప్పును ఒప్పుకొని తివారి కన్నా తానే బెటర్ అనిపించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నాయుడుగూడానికి చెందిన కె.నాగమణి అనే మహిళ తన తండ్రి పూర్ణచంద్రారావుపై రెండేళ్ల క్రితం మానవ హక్కుల వేదికను ఆశ్రయించింది. తన తండ్రి తనను కూతురుగా ఒప్పుకోవడం లేదని ఆయన తన తండ్రేనని అందుకు తాను డిఎన్‌ఏ పరీక్షలకు సైతం సిద్ధం అని హెచ్చార్సీని ఆశ్రయించింది. ఈ కేసులో బాధితురాలు నాగమణి, ఆమె తండ్రి పూర్ణచంద్రా రావు గురువారం హెచ్చార్సీ ముందుకు వచ్చారు. తాను పుట్టినప్పుడే తన తల్లిని, తనను ఇంట్లో నుండి గెంటి వేసి వేరే మహిళతో తన తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అందుకుగాను ఆయనకు గతంలో శిక్ష కూడా పడిందని హెచ్చార్సీకి నివేదించింది.

తన తల్లికి అప్పటి నుండి విడాకులు గానీ, మనోవర్తిని గానీ ఇవ్వలేదని ఆరోపించింది. పైగా తాను తన కూతురినే కాదని అంటున్నాడనేది ఆమె ప్రధాన ఆరోపణ. తన తండ్రి నుండి తాను ఏమీ ఆశించడం లేదని తన కూతురు అని ఒప్పుకుంటే చాలని చెప్పింది. ఇందుకోసం తాను నలభై ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని చెప్పింది. తనకు న్యాయం జరగక పోయే సరికి హెచ్చార్సీని ఆశ్రయించినట్లు చెప్పారు. తన తండ్రి తమను వదిలేసినప్పటి నుండి తాను, తన తల్లి దుర్భర జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కూతురుగా నిరూపించుకోవడం కోసం తాను డిఎన్ఎ పరీక్షలకు సైతం సిద్ధమని చెప్పింది. అయితే గురువారం కేసు విచారణకు వచ్చిన సమయంలో కూతురును చూసిన తండ్రి పూర్ణ చంద్రారావు ఎట్టకేలకు నాగమణి తన కూతురే అని ఒప్పుకున్నాడు. దాంతో కూతురు ఉప్పొంగిపోయింది.

అయితే ఈ సామాన్య వ్యక్తికి భిన్నంగా ఎన్‌డి తివారి తీరు కనిపిస్తోంది. రోహిత్ శేఖర్ అనే యువకుడు తివారి తన తండ్రే అని కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తివారి డిఎన్ఎ పరీక్షలకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆయన కోర్టు మాటలను బేఖాతరు చేస్తూ ఇప్పటి వరకు డిఎన్ఎ పరీక్షలకు ఒప్పుకోవడం లేదు. అందుకు ఆయన చెప్పే కారణాలు సైతం కోర్టును సంతృప్తిపరచ లేక పోతున్నాయి. తివారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు గురువారం తివారి కనీసం తన వెంట్రుకలు, గోర్లు, చర్మం తదితరాలు అయినా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడా అని తివారి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అంతే కాదు. పరీక్షలకు ఒప్పుకోకుంటే రోహిత్ శేఖర్ తండ్రిగా కోర్టు ప్రకటిస్తుందని హెచ్చరించారు.

English summary
Another ND Tiwari came out in West Godavari district. But he accepted his daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X