హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరం నిద్ర పోతున్న వేళ సినిమా నిర్మాత అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagaram Nidrapothunna Vela
హైదరాబాద్: నగరం నిద్రపోతున్న వేళ సినిమా నిర్మాత నంది శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజలకు దాదాపు 130 కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురుదేవ్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో అతను వేలాది మంది నుంచి డబ్బులు పసూలు చేసి మోసం చేసినట్లు చెబుతున్నారు.

గురుదేవ్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో ఆయన చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తున్నాడు. ఈ కేసులో మరింత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు. సంస్థ బోర్డు డైరెక్టర్లను కూడా అదుపులోకి తీసుకుంటారని అంటున్నారు. నంది శ్రీహరిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆయన నిర్మించిన నగరం నిద్రపోతున్న వేళ సినిమా ఇటీవలే విడుదలైంది.

నంది శ్రీహరిని పోలీసులు హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. తాను ఓ తప్పూ చేయలేదని, అన్ని విషయాలూ కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన అంటున్నారు. అందరికీ డబ్బుల చెల్లిస్తానని ఆయన అన్నారు. వివిధ సెక్షన్ల కింద శ్రీహరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లక్షా నలబై వేల రూపాయలకు వంద గజాల ప్లాట్ ఇస్తానని చెప్పి 34 వేల మంది నుంచి శ్రీహరి డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. శ్రీహరితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

English summary
Nagaram Nidrapothunna Vela cinema producer Nandi Srihari is arrested by Hyderabad police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X