హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరని సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి మృతి వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anil Reddy
హైదరాబాద్: గమ్యం సినిమా సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి మృతిపై రాజుకున్న వివాదం ఆరడం లేదు. తాజాగా, అనిల్ రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు బుధవారం సందేహాలు వ్యక్తం చేశారు. అనిల్ రెడ్డి మృతిపై సిబిసిఐడి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అనిల్ రెడ్డి మృతదేహానికి మూడు సార్లు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికల్లో తేడాలు ఉండడంపై వారు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అనిల్ రెడ్డి తలకు బలమైన గాయం ఉందని చెప్పిన వైద్యులు సహజ మరణంగా ఎలా చెబుతారని ఫోరెన్సిక్ నిపుణుడు రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. తొలి పోస్టుమార్టం నివేదికలో అనిల్ రెడ్డి తలకు బలమైన గాయం తగిలిందని చెప్పారని ఆయన బంధువు కూడా అయిన రవీందర్ రెడ్డి అన్నారు. పోస్టుమార్టం నివేదిక ఎప్పుడు కూడా ప్రశ్నలతో ఉండదని ఆయన అన్నారు. పోస్టుమార్టం నివేదికలను చూస్తుంటే అనిల్ రెడ్డి మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.

English summary
Gamyam film music director Anil Reddy's family members demand CBCID enquiry on his death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X