హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సునీల్ పూలరంగడు చిత్రానికి తెలంగాణ సెగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sunil
హైదరాబాద్: ప్రముఖ కమెడియన్ సునీల్ హీరోగా నటిస్తున్న పూలరంగడు చిత్రానికి తెలంగాణ సెగ తగిలింది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని శంషాబాద్‌లోని చౌదరిగూడలో సునీల్ పూలరంగడు చిత్రీకరణ మంగళవారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, పలువురు తెలంగాణవాదులు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి చిత్రీకరణను అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు, చిత్ర యూనిట్ తెలంగాణవాదులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

పూలరంగడులో చిత్రంలోని ఓ సన్నివేశం, ఓ పాట చిత్రీకరణ కోసం యూనిట్ చౌదరిగూడకు వచ్చింది. సన్నివేశంలో భాగంగా గ్రామీణ వాతావరణం కోసం ఆ గ్రామానికి వచ్చారు. మూడు రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ ఉంది. కాగా సోమవారం హీరో నితిన్ ఇష్క్ చిత్రాన్ని కూడా జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో తెలంగాణవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. నితిన్ జై తెలంగాణ అనడంతో తెలంగాణవాదులు వెనుదిరిగారు.

English summary
Telanganites obstructed Sunil's Poola Rangadu cinema shooting at Choudariguda of Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X