
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని 700 కోట్లవ శిశువు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని మాల్ గ్రామంలో సోమవారం ఉదయం గం.7.20 నిమిషాలకు జన్మించింది. సోమవారం జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లకు చేరుకుంది. కాగా ఇటీవలె ఐక్య రాజ్య సమితి జనాభా లెక్కల విభాగం అక్టోబర్ 31వ తేదిన జన్మించే మొదటి శిశువుతో ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లకు చేరుకుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే 7వ బిలియన్ శిశువుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Read: In English
మనీలాలో జన్మించిన ఓ శిశువుతో జనాభా 7 బిలియన్లకు చేరుకుందని ఐక్య రాజ్య సమితి అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. 1999లో ఓ బోస్నియా బాలుడిని ఆరువందల కోట్ల శిశువుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటికీ ఈసారి ఆ ప్రణాళిక లేదు.












