హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలోని జగన్ పార్టీ నేత ఇంట్లో సిఐడి సోదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్/కడప: ఆంధ్ర ప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్‌ మాజీ అధికారి కిషన్ ఇంట్లో సిఐడి అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మహిళా సాధికార సంస్థలో భారీ కుంభకోణం జరిగినట్లుగా సిఐడి దృష్టికి రావడంతో ప్రాథమిక విచారణ అనంతరం వారు కిషన్‌తో సహా మరో పన్నెండు మంది మాజీ అధికారుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఈ సంస్థలో సుమారు యాభై కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్లుగా సిఐడి ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో వారు ప్రభుత్వం అనుమతితో కిషన్ సహా అందరి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కిషన్ డిప్యుటేషన్‌పై వచ్చారు.

2006 - 2009 మధ్య కాలంలో జరిగిన ఈ కుంభకోణానికి ఆయనే సూత్రధారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వహణలో అక్రమాలతో పాటు అర్హత లేని వారికి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సిఐడి పలు కీలక పత్రాలు, సిడిలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిఐడి అధికారులు మూడేళ్ల రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు రుణాల కేటాయింపులో అవకతవకలపై కడప జిల్లాలోని పోరుమామిళ్లలో మాజీ చైర్మన్, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేత కృష్ణమ్మ ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

English summary
CID searched former IFS officer Kishan Reddy and another eleven former officers residence in AP Woman Finance Corporation Scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X