వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిపై లాజిక్ లాగిన చంద్రబాబు, వైయస్ పెద్ద రౌడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతిపై లాజిక్ లాగారు. ఆయన బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ నేతలు తమపై అవినీతి ఆరోపణలు చేస్తే మేం స్పందిస్తున్నామని కానీ తాము చేసే ఆరోపణలపై మాత్రం వారు స్పందించడం లేదని దీన్ని బట్టే ఎవరు అవినీతిపరులో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అంత రౌడీ రాజకీయాల్లో లేడన్నారు. ఆదర్శ రైతులంతా కాంగ్రెసు కార్యకర్తలే అన్నారు.

నా హయాంలో అధికారులు కష్టపడి పని చేస్తే వైయస్ ప్రభుత్వ హయాంలో అవినీతిపరులుగా మారారన్నారు. నా పాలనలో స్వార్థం చూసుకోలేదన్నారు. కాంగ్రెసు నేతలు పందికొక్కుల్లా బలిస్తే మా నేతలు బక్కి చిక్కి పోయారన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వక పోవడం నేను చేసిన తప్పేనన్నారు. అది ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu lashes out at late YS Rajasekhar Reddy. He blamed his ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X