2102 చైనాలో జాయింట్ వెంచర్‌తో ప్రారంభం

గురువారం, నవంబర్ 24, 2011, 10:20 [IST]
Dreamworks reportedly planning to enter China in 2012
చైనా మ్యాగజైన్ కైజింగ్ అందించిన సమాచారం ప్రకారం డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ సంస్ద వచ్చే సంవత్సరం జాయింట్ వెంచర్‌గా చైనాలోకి ప్రవేశించనుందని సమాచారం. చైనా లొకల్ మార్కెట్లో రాబోయే ఐదు సంవత్సరాలకు ఆపరేషన్స్‌ని కొనసాగించేందుకు గాను $2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ సంస్ద చైనాలో ఉన్న షాంఘై మీడియా గ్రూప్, చైనా మీడియా క్యాపిటల్‌తో పాటు, మరికొన్ని సంస్దలకు తన వంతు సహాయ సహాకారాలను అందివ్వడం జరుగుతుంది.

డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ సంస్ద స్దాపించనున్న ఈ వెంచర్‌కి సంబంధించిన పనులు అన్ని పూర్తి అయినప్పటికీ, అధికారకంగా జనవరి 2012లో ప్రకటించనున్నారు. మొదటగా డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ సంస్ద చైనా వీడియో షేరింగ్ వెబ్‌సైట్ 'యూకు'తో కలసి ప్రారంభించనున్నట్లు సమాచారం. గతంలో యూకు, 450 వార్నర్ బ్రదర్స్‌కి సంబంధించిన సినిమాలను ప్రమోషన్‌ని చేపట్టిన విషయం తెలిసిందే.
English summary
Dreamworks Animation is reportedly preparing to launch a joint venture in China next year.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets