హైదరాబాద్: నైతిక విలువలకు కట్టుబడి ఉండాలనుకుంటే ప్రభుత్వాలు పదిరోజుల్లో పడిపోయేవని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఆరోపణలు వస్తే రాజీనామాలు చేసే సంప్రదాయం సంజీవరెడ్డి కాలంలోనే పోయిందన్నారు. ప్రస్తుత కాలంలోనైతికత అంటే కుదిరే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలు చూసైనా మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులపై ఆరోపణలు రావడం సహజమేనని వాటిని తొలగించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు. కేసులు వేయడం వారి వారికి చెందినవని కేసు వేయొద్దనో వేయమనో చెప్పడానికి మనమెవరమన్నారు.
మంత్రులు తప్పు చేస్తే శిక్షించడం సబబే అన్నారు. నాపై కేసు వేసినా స్వాగతిస్తానని చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యపై తెలుగుదేశం పార్టీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై బురద జల్లడం సరికాదన్నారు. జనార్ధన్ రెడ్డి హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నది రోశయ్య కాదని అలాంటప్పుడు అప్పుడు జరిగిన దానికి ఆయన ఎలా బాధ్యులవుతారన్నారు. ఇన్నాళ్లూ మంత్రులపై మాట్లాడకుండా ఉన్న టిడిపి నేతలు ఇప్పుడు కోర్టుకెళ్లడం కక్ష సాధింపేనన్నారు.