న్యూఢిల్లీ: సానిమా మిర్జా ఒకప్పటి టెన్నిస్ సంచలనం. కానీ ఇప్పడు తరచూ గాయాల భారిన పడుతున్న టెన్నిస్ క్రీడాకారిణి. అంతర్జాతీయ టెన్నిస్‌లో ప్రస్తుతం 87వ ర్యాంక్‌లో ఉన్న సానియా వచ్చే జనవరి 1 నుండి న్యూజిలాండ్‌లో జరగనున్న డబ్ల్యూటిఎ ఈవెంట్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. 2012వ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ టొర్నీలలో పాల్గోనాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. సంవత్సరం మొత్తం మీద సుమారు 20 నుండి 25 వరకు టోర్నీలు ఆడితే లండన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌కు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
గతంలో యుఎస్ ఓపెన్‌లో గాయం అవ్వడంతో మోకాలికి సర్జరీ చేయించుకున్న సానియా మిర్జా ఇప్పడిప్పుడే ఆ గాయం నుండి కొలుకొవడం జరుగుతుంది. తిరిగి మల్లా ఫిట్ నెస్ కొసం వారం రోజలు నుండి కోర్టులో ప్రాక్టీసుని ప్రారంభించింది. ఈ సందర్బంలో సానియా మిర్జా మళ్లీ తిరిగి రాకెట్ పట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది. ఫిట్‌గానే ఉన్నప్పటికీ ప్రాక్టీస్ కొంత నెమ్మదిగా సాగుతుంది. సింగిల్స్ ఆడుతున్న సమయంలో గాయాలు వెంబడిస్తుండడంతో రాబోయే కాలంలో టోర్నీలను తగ్గించుకోలేను. ఎందుకంటే సింగిల్స్ ఆడేటప్పుడు ఇవన్నీ కూడా మామూలేనని స్పష్టం చేశారు.