'వరల్డ్ హాకీ సిరిస్' నుండి ఆరుగురు టాప్ ప్లేయర్స్ అవుట్..

గురువారం, డిసెంబర్ 1, 2011, 10:26 [IST]
Hockey
న్యూఢిల్లీ: భారతదేశం జాతీయ క్రీడ 'హాకీ' అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ సిరిస్ హాకీ కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సందర్బంలో హాకీ ఆటగాళ్లు వరల్డ్ హాకీ సిరిస్‌కు ఝలక్ ఇచ్చారు. డిసెంబర్ 17 నుండి భారత దేశ వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో జరిగే లీగ్‌ల నుండి ఆరుగురు టాప్ ఇండియన్ ఆటగాళ్లు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విషయాన్ని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి నరేందర్ భాత్రాకు లేఖను పంపినట్లు తెలిపారు. ఆ ఆరుగురు ఇండియా టాప్ ఆటగాళ్ల పేర్లను గనుక చూసినట్లేతే
గోల్‌కీపర్‌ భారత్‌ చెత్రి, పిఆర్‌ శ్రీజేష్‌, సందీప్‌ సింగ్‌, డిఫెండర్‌ సర్దార్‌ సింగ్‌, ఫార్వర్డ్‌ తుషార్‌ ఖాంద్కెర్‌, యువరాజ్‌ వాల్మీకిలు ఉన్నారు.

ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ తాము దేశం కొసం ఆడతామని, ఈ లీగ్ సిరిస్ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. తాము వరల్డ్‌ సిరీస్‌ హాకీ ఈవెంట్‌లో ఆడటం లేదని, డిసెంబర్‌ 11న ఒలింపిక్‌లో అర్హత సాధించిన వారి కోసం 2012 సంవత్సరం వరకు ఢిల్లీలో జాతీయ శిబిరానికి హాజరవుతామని ఆరుగురు ఆటగాళ్లు సంతకం చేసి లేఖలో వివరించారు. ఒలింపిక్‌లో అర్హత సాధించిన వారికోసం జాతి జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటామని తెలిపారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఛాంపియన్‌ చాలెంజ్‌-1 టౌర్నమెంట్‌లో ఆడుతున్న ఈ క్రీడాకారులు దేశం కోసమే ఆడతామని అంటున్నారు.ఒలింపిక్‌కు అర్హత పొందిన వారి కోసం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వరల్డ్‌ సిరీస్‌ నిర్వాహకులు తమ ఈవెంట్‌ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉంటే వరల్డ్‌ సిరీస్‌ హాకీ నిర్వాహకులు మాట్లాడుతూ, ఆరుగురు ఆటగాళ్లు టౌర్నమెంట్‌ నుంచి వైదొలగినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని అన్నారు.
English summary
In an interesting turn of events, six key members of the national hockey team, including four seniors, "pulled out" of the World Series Hockey (WSH) - to be held from December 17 to January 22 -- saying they would be rather attending the national camp in the capital for the Olympic qualifiers.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets