రింగులో పడిపోయి రష్యా బాక్సర్ రోమన్ మృతి

శుక్రవారం, డిసెంబర్ 9, 2011, 15:33 [IST]
Roman Simakov
మాస్కో: రష్యన్ బాక్సింగ్ సమాఖ్య డబ్ల్యుబిసి ఆసియా టైటిల్ పోటీల్లో నాకవుట్ తర్వాత కోమాలోకి వెళ్లిపోయిన రష్యా లైట్ - హెవీ వెయిట్ రోమన్ సిమకోవ్ మరణించాడు. అతని వయస్సు 27 ఏళ్లు. ఈ విషయాన్ని రష్యన్ బాక్సింగ్ సమాఖ్య గురువారం ప్రకటించింది. రింగులో పడిపోయిన సిమకోవ్‌ను స్ట్రెచర్‌పై బయటకు తీసుకుని వెళ్లారు. సెర్జీ కోవలేవ్‌తో సోమవారం జరిగిన పోటీలో సిమకోవ్ ఏడో రౌండ్‌ నాకవుట్‌లో పడిపోయాడు.

అతను కోమాలోకి వెళ్లిపోయాడని, వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించామని, అయితే వైద్యులు అతన్ని బతికించలేకపోయారని రష్యన్ బాక్సింగ్ సమాఖ్య ఓ ప్రకనటలో వివరించింది. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోస్టు మార్టం జరుగుతుందని రియా నోవోస్తి న్యూస్ ఏజెన్సీ తెలిపింది. సిమకోవ్ 2008లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 22 సార్లు పోరాడి 19 సార్లు గెలిచాడు.
English summary
Russian light - heavyweight Roman Simakov has died at the age of 27.
User Comments
ra 09 Dec 2011 03:53 pm
not good
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets