మరువలేమన్న రోశయ్య, పెద్దదిక్కు కోల్పోయాం: ప్రిన్స్

ఆదివారం, డిసెంబర్ 11, 2011, 14:38 [IST]
K Rosaiah and Mahesh Babu
చెన్నై/హైదరాబాద్: ఎంఎస్ రెడ్డితో తనకు మంచి అనుబంధముందని తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆదివారం అన్నారు. హైదరాబాదులోని తన నివాసంలో ఎంఎస్ రెడ్డి ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. రెడ్డి మృతి వార్త తెలిసిన రోశయ్య దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధం మరువలేనిది అన్నారు. ఎంఎస్ రెడ్డి మృతదేహానికి ప్రిన్స్ మహేష్ బాబు నివాళులర్పించారు. ఆయన మా కుటుంబసభ్యులలో ఒకరుగా ఉండేవారని, పెద్ద దిక్కును కోల్పోయామని మహేష్ ఆవేదన చెందారు. తనను పరిశ్రమలో బాగా ప్రోత్సహించారని కృష్ణం రాజు అన్నారు. ఆయన మృతి విచారం కలిగిగించిందని, తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే ఆయన కవిత్వం ఎవరూ మరువలేరని బిజెపి సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి అన్నారు.

అక్కినేని నాగేశ్వర రావు, రామానాయుడు, రాఘవేంద్ర రావు, సినారె, చిరంజీవి, కృష్ణ, శ్రీహరి, శ్రీను వైట్ల, నేదురుమల్లి, జానా రెడ్డి, కెవిపి, నటి రోజా నివాళులర్పించారు. సిఎం కిరణ్, మంత్రులు డికె అరుణ, శంకర రావు, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, వాస్తు శిల్పి బిఎన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
English summary
Tamilnadu governor Rosaiah condolence to MS Reddy. Hero Mahesh Babu said film industry loss great man.
User Comments
N M 12 Dec 2011 02:15 pm
who is M S Reddy? left side guy or right side guy??
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets