భారత స్టార్ సింగిల్ షట్లర్ సైనా నెహ్వాల్ శనివారం రికార్డు సృష్టించింది. బిడబ్యుఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. 2009లో భారత మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జ్వాల, దిజు ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ క్రీడాకారిణి టిన్ బౌన్‌తో జరిగిన సెమీఫైనల్లో సైనా 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన పోరులో సైనా తన హవా కొనసాగించింది.
ర్యాలీస్‌లో ఎక్కువ పాయింట్లు గెల్చుకుని విజయానికి దగ్గరయింది. ర్యాలీస్‌లో సైనా 23 పాయింట్లు గెల్చుకోగా ప్రత్యర్ధికి 14 పాయింట్లు దక్కాయి. సైనా 11 నెట్ విజయాలు సాధించగా ప్రత్యర్ధి 12 పాయింట్లు గెల్చుకుంది. తొలి గేమ్‌లో ఇరువురూ షట్లర్లు 14-14తో సమంగా నిలిచారు. సైనా వరుసగా నాలుగు పాయింట్లు గెల్చుకుంది. 21-17 గేమ్‌ను వశం చేసుకుంది. రెండో గేమ్ కూడా హోరా హోరి సాగింది.
ఒక దశలో ఇద్దరు 13-13తో సమంగా నిలిచారు. తర్వాత కూడా ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే కీలక సమయంలో బౌన్ తప్పులకు పాల్పడింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ 21-18 తేడాతో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓ భారత క్రీడాకారిణి సూపర్ సిరీస్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే ప్రథమం. ఆదివారం జరిగే ఫైనల్లో సైనా ప్రపంచ నెంబర్‌వన్ ఇయాన్ వాంగ్ (చైనా)తో తలపడుతుంది. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో మూడో సీడ్ జిన్ వాంగ్‌ను ఓడించిన విషయం తెలిసిందే.