సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌లో 'సైనా నెహ్వాల్' ఓటమి..

ఆదివారం, డిసెంబర్ 18, 2011, 17:22 [IST]
Saina Nehwal
చైనా: వరల్డ్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఓటమి పాలయింది. ఆదివారమిక్కడ జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్‌వన్ యిహాన్ వాంగ్(చైనా) చేతిలో 21-18, 13-21, 13-21తో పరాజయం చవిచూసింది. నాలుగు వరుస విజయాలతో ఫైనల్‌కు వెళ్లిన సైనా తుదిపోరులో ప్రపంచ నెంబర్‌వన్‌ ఇయాన్‌ వాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

భారత స్టార్‌ సింగిల్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ శనివారం రికార్డు సృష్టించింది. బిడబ్యుఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. 2009లో భారత మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో జ్వాల, దిజు ఫైనల్స్‌ చేరిన సంగతి తెలిసిందే. డెన్మార్క్‌ క్రీడాకారిణి టిన్‌ బౌన్‌తో జరిగిన సెమీఫైనల్లో సైనా 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన పోరులో సైనా తన సత్తా చాటిన విషయం తెలిసిందే.
English summary
An erratic Saina Nehwal let slip the early advantage as she went down to world number one Wang Yihan in the summit clash to sign off as runner-up in the BWF season-ending World Superseries Finals in Liuzhou, China on Sunday.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets