ముంబై: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెరుగైన ఆటను కనబరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపింది. సోమవారం ఇక్కడి ఐఎంసి సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సానియా మట్లాడుతూ ఈ సంవత్సరం యూఎస్ ఓపెన్ అనంతరం గాయంతో ఆటకు దూరమడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు సద్దమవుతున్నానని అన్నారు. ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె ఇటీవలే న్యూఢిల్లీలో ప్రాక్టీసు మొదలుపెట్టింది. వచ్చే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 16 నుంచి జరుగుతుంది.
ఈ సందర్భంగా విలేకర్లు ఆమె వ్యక్తిగత జీవితం, వివాదాలపై అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చింది. షోయబ్ మాలిక్‌తో ఎటువంటి విబేధాలు లేవని, తమ కాపురం సాఫీగా సాగుతుందని తెలిపింది. కొత్త సీజన్‌లో అంత మంచే జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. త్వరలోనే పూర్వవైభవం సాధిస్తాననే నమ్మకాన్ని సానియా వ్యక్తం చేసింది. తన పెళ్లిపై మీడియా అనవసర రాద్దాంతం చేసిందని, ఇది తనను, మాలిక్‌ను ఎంతో ఆవేదనకు గురిచేసిందని చెప్పింది.
అయితే గతాన్ని తాను ఎప్పుడో మరచి పోయానని, కానీ మీడియా ఎప్పుడూ దాన్ని తవ్వేందుకు ప్రయత్నించడం బాధగా ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు మాలిక్ విషయంలో కూడా మీడియా అతిగా స్పందించిందని వాపోయింది. తమకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సానియా సూచించింది. కాగా, కొంతకాలంగా తనను వేధించిన గాయాలు తగ్గాయని, ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని సానియా చెప్పింది.