కీలక దశకు ఉద్యమం: కెసిఆర్ నోటి నుండి అదే పాట

గురువారం, డిసెంబర్ 29, 2011, 17:49 [IST]
K Chandrasekhar Rao
మహబూబ్ నగర్: తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ పాత పాటే పాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పోరు యాత్రకు కెసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమం కీలక దశకు చేరుకుందన్నారు. సంక్రాంతి తర్వాత మలి విడత ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. జనవరి 17వ తేదిన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాజకీయ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యమం ఏరూపంలో ఉన్నా ప్రజల సహకారం అవసరమన్నారు. వెన్నెముకలేని రాజకీయ నాయకులే తెలంగాణకు శాపంగా మారారన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ముందు ముందు ఉద్యమం భయంకరంగా ఉంటుందన్నారు. కేంద్రం ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించడం లేదన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలన్నారు. తెలంగాణ ఇప్పుడు సాధించుకోకుంటే కట్టుబానిసలుగా మారాల్సి వస్తుందన్నారు. పదకొండేళ్లుగా సహనంతో ఉద్యమిస్తున్నామని, రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యమన్నారు. కాగా పలువురు కాంగ్రెసు, టిడిపి కార్యకర్తలు కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.
English summary
TRS chief K Chandrasekhar Rao repeated his old statement on telangana. He said that movement is in final stage.
User Comments
Nag 29 Dec 2011 10:31 pm
vallaku vennemuka ledhu, prajalaku burra ledhu. Lekapothe neelantodini heroni chesthara ?
Nag 29 Dec 2011 10:30 pm
vallaku vennemuka ledhu, prajalaku burra ledhu. Lekapothe neelantodini heroni chesthara ?
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets