కొరియా: హైదరాబాద్ ఏస్ షెట్లర్ సైనా నెహ్వాల్ కొరియా ఓపెన్ సిరీస్‌లో బుధవారం శుభారంభం చేసింది. స్కాట్లాండ్‌కు చెందిన ఎగెల్ స్టాఫ్‌తో ఆమె తొలి రౌండులో తలపడింది. మొదటి రెండు రౌండ్లను సైనా నెహ్వాల్ ఎగెల్‌పై అలవోకగా గెలిచింది. 21-5, 21-6తో ఆమె ఎగెల్ స్టాఫ్‌పై గెలిచింది. కాగా 2011 ఆఖరులో సైనా నెహ్వాల్ వరల్డ్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ వరకు చేరి చతికిల పడిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో ప్రపంచ నెంబర్‌వన్ యిహాన్ వాంగ్(చైనా) చేతిలో 21-18, 13-21, 13-21తో పరాజయం చవిచూసింది. నాలుగు వరుస విజయాలతో ఫైనల్‌కు వెళ్లిన సైనా తుదిపోరులో ప్రపంచ నెంబర్‌వన్ ఇయాన్ వాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
కాగా అంతకుముందు శనివారం భారత స్టార్ సింగిల్ షట్లర్ సైనా నెహ్వాల్ శనివారం రికార్డు సృష్టించింది. బిడబ్యుఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. 2009లో భారత మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జ్వాల, దిజు ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ క్రీడాకారిణి టిన్ బౌన్‌తో జరిగిన సెమీఫైనల్లో సైనా 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన పోరులో సైనా తన సత్తా చాటిన విషయం తెలిసిందే.