చంద్రబాబు మీద ఒంటికాలిపై లేచిన రాములమ్మ

శుక్రవారం, జనవరి  6, 2012, 14:49 [IST]
Vijayashanthi
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై టిఆర్ఎస్ మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి గూండాల, హంతకుల పార్టీ అని ధ్వజమెత్తారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాబు పర్యటన సందర్భంగా ఇంతమందిపై దాడి జరుగుతున్నా ప్రభుత్వం స్పందించదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేని భద్రత ప్రతిపక్ష నేతకా అని ప్రశ్నించారు. బషీర్‌బాగ్ వద్ద రైతులపై కాల్పులు జరిపించిన, అంగన్ వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన బాబు చరిత్ర అందరికీ తెలుసున్నారు. రైతుల కోసమని ఆయన చెబితే నమ్మె స్థితిలో ఎవరూ లేరన్నారు. రైతులను పరామర్శించడానికి హుందాగా వెళ్లాలి కానీ గూండాలతో కాదన్నారు.

బాబుది ముమ్మాటికి దండయాత్రేనని విమర్శించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి టిడిపి ప్రయత్నిస్తోందన్నారు. పోలీసులు, గూండాలతో దండలేయించుకొని ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారన్నారు. తాము తెలంగాణ కోసం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని తదితరులను నిలదీశామన్నారు. ప్రధానినే నిలదీసిన తమకు బాబు ఓ లెక్క కాదన్నారు. గూండాలతో మహిళలను కొట్టిస్తూ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. అరెస్టు చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తుంటే చంద్రబాబు సంతోషిస్తున్నారని విమర్శించారు. టిడిపి కాంగ్రెసుకు తోక పార్టీ అన్నారు.

తాను సోనియా ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్ధమని బాబు వస్తారా అని సవాల్ విసిరారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ మాట్లాడినా నిలదీస్తామన్నారు. తెలంగాణకు అనుకూలమైతే చంద్రబాబు హోంమంత్రి చిదంబరానికి లేఖ రాయాలన్నారు.
English summary
TRS MP Vijayashanthi lashed out at TDP chief Nara Chandrababu Naidu for his tour in Warangal. She demanded arrest him.
User Comments
Narasimha Thota 07 Jan 2012 07:09 am
em, inko kaalu dobbinda? Ayina 30 years gaa rojukokaritho padukunte kallu, kallu poye rogalu ravaa mari.
Kiran Kumar 06 Jan 2012 02:59 pm
ravulamma nuvvu chesina vimarsaki evvadanna ?? ee okkadanna pratispandinchada ??? ponile pichi kukka morugutundi ani vadilestaru..
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets