యోగా గురు బాబా రామ్‌దేవ్ ముఖంపై నల్ల సిరా

శనివారం, జనవరి  14, 2012, 14:40 [IST]
Baba Ramdev
న్యూఢిల్లీ: యోగా గురు రామ్‌దేవ్ ముఖంపై ఓ వ్యక్తి నల్ల సిరా చల్లాడు. అవినీతి, నల్లధనంపై మీడియా ప్రతినిధుల సమావేశంలో ఓ వ్యక్తి రామ్‌దేవ్‌పై సిరా చల్లాడు. ఆయన ముఖంపై, దుస్తులపై సిరా పడింది. దీంతో ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటనపై బాబా రామ్‌దేవ్ తర్వాత ప్రతిస్పందించారు. తాను చేసినదానికి ఇది సరైందేనని ఆయన అన్నారు. ఆ వ్యక్తిని రామ్‌దేవ్ మద్దతుదారులు పట్టుకుని చితకబాదారు. దీంతో అతని నోటి నుంచి రక్తం కారింది.

రామ్‌దేవ్‌పై దాడి చేసిన వ్యక్తిని కమ్రాన్ సిద్ధిఖిగా గుర్తించారు. బాట్లా ఎన్‌కౌంటర్‌పై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆతను ఈ పనికి ఒడిగట్టాడని తెలుస్తోంది. అతను ఓ ఎన్‌జివోలో పనిచేస్తున్నాడు. నల్లధనాన్ని భారదేశానికి తీసుకురావాలని తాను అడుగుతుంటే నల్ల సిరా ఇచ్చారని రామ్‌దేవ్ అన్నారు. సత్యం కోసం పోరాడే వారు మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. ఈ సంఘటన తనపై ప్రభావం చూపబోదని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్పారు.
English summary
A man threw black ink on the face of yoga guru Baba Ramdev as he was holding a press conference on black money and corruption at the Constitutional Club here on Saturday.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets