బస్రా: దక్షిణ ఇరాక్‌లోని బస్రా పట్టణ ఇరాక్‌లో శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన షియా యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. క్షతగాత్రులను బస్రా ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్రాలోని సాద్ర్ ఆస్పత్రి వర్గాలు మాత్రం 25 మంది మరణించారని, 40 మంది దాకా గాయపడ్డారని చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో షియాలపై దాడులు జరుగుతున్నాయి. అమరుడు ఇమామ్ హుస్సేన్‌కు నివాళులు అర్పించడానికి చేసే అసుర వార్షికోత్సవం సందర్భంగా 40 రోజుల అర్బీన్ ముగింపు సన్నివేశంలో ఈ దాడి జరిగింది. బాస్రా శివారులో యాత్రికులకు కేక్‌లు పంచి పెడుతూ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు.