పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయానికి తానే బాధ్యత వహిస్తున్నానని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదివారం చెప్పారు. తన వైఫల్యాన్ని అంగీకరిస్తున్నానన్నారు. ఓటమికి కారణమేమిటని విలేకరులు అడగ్గా ధోనీ స్పందించారు. ఈ ఓటమికి తానే ప్రధాన దోషిని అన్నారు. కెప్టెన్‌గా తనను తానే నిందించుకుంటున్నానని చెప్పారు. పరుగులు సాధించడంలో బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారన్నారు. కోచ్ డంకన్ ఫ్లెచ్చర్‌ను నిందించడం సరికాదన్నారు. ఆయన అనుభవమున్న కోచ్ అని, ఆటగాళ్లు సరిగా ఆడకపోవడానికి ఆయనను నిందించవద్దన్నారు. కాగా ధోనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. పెర్త్‌లోని మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో అడిలైడ్‌లో జరగనున్న నాలుగో టెస్టుకు ధోని దూరం కానున్నారు.
బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతుండటంతో సిరీస్‌లో వెనుక పడ్డామని బౌలర్ ఉమేష్ యాదవ్ అన్నారు. దురదృష్టమో లేదా మరేమో కాని అందరూ కష్టపడుతున్నా ఎందుకో సాధ్యం కావడం లేదన్నారు. పాంటింగ్ అయినా క్లార్క్ అయినా ప్రతి వికెట్ విలువైందేనన్నారు. 180 పరుగులతో ఆడుతున్న వార్నర్ క్యాచ్ పట్టేటప్పుడు తాను ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. ఒకవేళ దాన్ని వదిలేస్తే జట్టు పరిస్థితి ఏమిటి అనే ఆలోచన వచ్చిందన్నారు. కాగా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకున్న విషయం తెలిసిందే. నాలుగు టెస్టుల మ్యాచ్‌లో ఆసీస్ మూడింటిలోనూ విజయం సాధించింది.