మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. ఇక్కడి మెల్‌బోర్న్ పార్క్ లో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోరులో సానియా 4-6, 2-6తో స్వెతానా పిరొంకోవా (బల్గేరియా) చేతిలో వరుస సెట్లలో చిత్తయింది. గంటా 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సానియా తొలిసెట్‌లో కొద్దిగా పోరాడినప్పటికీ.. రెండోసెట్‌లో చేతులెత్తేసింది.
ఆరంభంలో పిరొంకోవాకు గట్టి పోటీ ఇచ్చిన సానియా, ఇక రెండోసెట్‌లో పిరొంకోవా సర్వీసును బ్రేక్ చేసే అవకాశాలను చేజార్చుకోవడంతో పేలవ ప్రదర్శనతో ఓటమిపాలైంది. భుజం గాయం కారణంగా పురుషుల సింగిల్స్ విభాగం నుంచి సోమ్‌దేవ్ ఇంతకుముందే వైదొలిగాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), 11వ సీడ్ డెల్ పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లగా... ఆస్ట్రేలియా రైజింగ్ స్టార్ బెర్నాడ్ టామిక్ ధాటికి 22వ సీడ్ ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. 4 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టామిక్ 4-6, 6-7 (3/7), 6-4, 6-2, 7-5తో వెర్దాస్కోపై సంచలన విజయం సాధించాడు.
ఫెదరర్ 7-5, 6-2, 6-2తో కుద్రయెత్సెవ్ (రష్యా)పై, నాదల్ 6-4, 6-1, 6-1తో కుజ్‌నెత్సోవ్ (అమెరికా)పై, డెల్ పొట్రో 2-6, 6-1, 7-5, 6-4తో మనారినో (ఫ్రాన్స్)పై గెలిచారు. ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ మార్డీ ఫిష్ (అమెరికా), పదో సీడ్ అల్మాగ్రో (స్పెయిన్), 13వ సీడ్ డొల్గొపొలోవ్ (ఉక్రెయిన్), 16వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 18వ సీడ్ లోపెజ్ (స్పెయిన్), 21వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.