ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య అరెస్టుకు సిబిఐ రెడీ?

శుక్రవారం, జనవరి  27, 2012, 11:20 [IST]
BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ప్రస్తుత హోం శాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్యను అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తుండడంతో ఆచార్యను అరెస్టు చేయాలని సిబిఐ అధికారులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఆచార్యను అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. ఈ నెల 31వ తేదీన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చార్జిషీట్ దాఖలు చేయాలని సిబిఐ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లోపల అరెస్టు పర్వాన్ని సిబిఐ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎమ్మార్‌తో కుదిరిన ఒప్పందంలో ప్రభుత్వ వాటా తగ్గించడానికి ఆచార్యనే బాధ్యుడని సిబిఐ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి అరెస్టయ్యారు. కుంభకోణానికి ప్రభుత్వ వ్యవహారమే కారణం కాబట్టి అందుకు సంబంధించిన అధికారులను అరెస్టు చేయక తప్పడం లేదని అంటున్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారి కావడంతో ఆచార్య అరెస్టుకు కేంద్రం అనుమతులు కావాల్సి ఉంటుంది. అనుమతుల విషయంలో జాప్యం కావడం వల్లనే ఆచార్య అరెస్టులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.
English summary
According to news reports BP Acharya may be arrested by CBI soon.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets