హైదరాబాద్: రూ.10 కోట్ల వ్యాపారం చేసే వారిపై కూడా పన్ను వేయవద్దని ఆందోళనలు, ధర్నాలు చేయడం సబబు కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. వస్త్ర వ్యాపారంపై వేసిన వ్యాట్‌ను రద్దు చేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు ఉదయం సిఎంను కలిశారు. వ్యాట్ మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని దానిని రద్దు చేయాలని వారు సిఎంను కోరారు. అందుకు కిరణ్ స్పందిస్తూ... రూ.5 లక్షల వరకు ఎలాంటి వ్యాట్ విధించలేదని, నలభై లక్షల రూపాయల వరకు కేవలం ఒక శాతం పన్ను మాత్రమే విధించామని చెప్పారు. ఆ పరిధి దాటితేనే వ్యాట్ విధించామని చెప్పారు. కోట్ల రూపాయల వ్యాపారులపై కూడా వ్యాట్ వద్దని డిమాండ్ చేయడం సబబేనా అని సిఎం వారిని ప్రశ్నించారు. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలనే మనం అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు. దీంతో వ్యాపారులు అసంతృప్తితో వెనుదిరిగారు.
తమ వ్యాపారం అంధకారం చేశారని, వ్యాట్ ఏ రాష్ట్రంలో లేదని కేవలం మన రాష్ట్రంలోనే ఉందని సిఎంను కలిసిన వ్యాపారులు ఆ తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. తమను అధికారులు కూడా వేధిస్తున్నారన్నారు. కాగా వ్యాట్‌ను నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారులు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో బంద్, కనిగిరిలో ర్యాలీలు, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో రాస్తారోకోలు ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. కాగా గుంటూరు జిల్లా నరసారావు పేటలో వైయస్ జగన్, టిడిపి నేత కోడెల శివ ప్రసాద్ పోటీ పోటీ దీక్షలకు దిగిన విషయం తెలిసిందే.