హైదరాబాద్: కేవలం అభివృద్ధి చేసుకుంటూ పోతే ఓట్లు పడవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుని, ప్రజల్లోకి తీసుకుని వెళ్తేనే ఓట్లు పడుతాయని ఆయన అన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెసు కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ప్రసంగించారు. తాము వంద రూపాయల పని చేసి ఒక్క రూపాయి ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నామని, మిగతా వాళ్లు ఒక్క రూపాయ పనిచేసి వంద రూపాయల ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి విస్తృతంగా ప్రచారం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
వడ్డీలేని రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన మెదక్ జిల్లా కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కూడా ఆయన చెప్పారు.
వడ్డీలేని రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన మెదక్ జిల్లా కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కూడా ఆయన చెప్పారు.