కిషన్ రెడ్డికి, కెసిఆర్‌కు మధ్య తేడాలు: బిజెపి దూరం?

శుక్రవారం, జనవరి  27, 2012, 14:15 [IST]
K Chandrasekhar Rao-Kishan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి, బిజెపికి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి మధ్య కూడా తీవ్ర స్థాయిలోనే విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దానివల్లనే తెలంగాణపై కిషన్ రెడ్డి పోరు యాత్రను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ పేరుతో కెసిఆర్ తన రాజకీయ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, రాజకీయంగా తమకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరడం లేదని బిజెపి నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా తెలంగాణ రాజకీయ జెఎసి కార్యకలాపాలను నడిపించే ప్రయత్నాలను కెసిఆర్ చేస్తున్నారని బిజెపి నాయకులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో తెలంగాణ జెఎసిలో ఉండడం వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలేవీ లేవని బిజెపి నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణ జెఎసి నుంచి తప్పుకోవాలనే ఆలోచన బిజెపిలో సాగుతున్నట్లు సమాచారం.

నిజానికి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలంగాణ జెఎసి కార్యక్రమాల్లో పెద్ద పాల్గొనడం లేదు. బిజెపి నుంచి సిహెచ్ విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ జెఎసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విద్యాసాగర రావు పార్టీ కన్నా జెఎసికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి నుంచి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఎప్పుడో తప్పుకున్నాయి. జెఎసి తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆ రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అభిప్రాయం బిజెపిలో పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
English summary
It is said that differences between TRS and BJP cropped up on Telangana issue
User Comments
Kiran Kumar 27 Jan 2012 02:34 pm
jointla action comitte for TRS ani BJP eppatiki telusovadam ante vallentha agnanam lo vunnaro artham avutundi... kodanda ram KCR pempudu kukka .. KCR,KTR,Harish la mata javadati emanna chesado anthe andari nayakula mida kottinattu vadi meda kuda kodigudlu kottistadu.. ade telangana vudyama style
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets