హైదరాబాద్: తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారానికి కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కొత్త ఫార్ములా చూపించారు. ముఖ్యమంత్రి పదవిని మూడేళ్ల పాటు సీమాంధ్రకు, రెండేళ్లు తెలంగాణకు ఇస్తే తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే ఉద్యమాలు జరుగుతున్నాయని, ఇందులో వేరే మాట లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కొత్తగా చెప్పేదేమీ లేదని, చెప్పాల్సింది ఇప్పటికే చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెసులో రెడ్లకు ప్రాధాన్యం తగ్గలేదని, తమకున్న ప్రాధాన్యం తమకు ఉందని ఆయన అన్నారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలను కూల్చివేసినంత మాత్రాన ఆశయాలను నీరు గార్చలేరని ఆయన అన్నారు. నిరాశతోనే తనను కాల్చేయండంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాల్చి చంపండంటూ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చాలా కాలంగా సీమాంధ్రకు చెందిన జెసి దివాకర్ రెడ్డి తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇరు ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని చెబుతున్నారు. హిందూపురంలో పోటీ చేస్తే బాలయ్య గెలుస్తాడనేది తన సోదరుడిది వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జగన్ వైపు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని ఆయన అన్నారు.