హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. దుమ్ముంటే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తనపై పోటీకి దిగాలని ఆయన సవాల్ విసిరారు. తనపై పోటీ చేసి చంద్రబాబు డిపాజిట్ దక్కించుకోవాలని ఆయన అన్నారు. తనపై ఎవరు పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. డబ్బున్న వ్యక్తిని తమపై పోటీకి దింపి తెలంగాణ ఓట్లు కొనలేరని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు.
చంద్రబాబు, ఆయన చెంచాలు తనపై దుష్ప్రచారం సాగిస్తున్నారని నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు కూడా డిపాజిట్లు దక్కవని ఆయన అన్నారు. తెలంగాణవారిని డబ్బుతో కొనలేరని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో నాగర్ కర్నూలు శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక వస్తోంది. ఇటీవల నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిసి ఉప ఎన్నికలపై మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరబోనని కూడా నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.