కాకినాడ/యానాం: రీజెన్సీ సెరామిక్ కంపెనీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మొత్తం ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. శుక్రవారం ఉదయం కార్మికుల చేతిలో గాయపడ్డ కంపెనీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందారు. కార్మిక నేత మురళీ మోహన్ మృతి చెందటంతో ఉదయం కొందరు కార్మికులు కంపెనీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉన్న ఆయన పైన కార్మికులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా అంతకముందు కంపెనీ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేశారు. కంపెనీ కార్యాలయానికి, పెట్రోలు బంకుకు కార్మికులు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్‌లో మురళీ మోహన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం ఆయనను హాస్పిటల్ తరలించారు. ఆయన మృతి చెందారు. మురళి మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ కార్మికులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు ఇరవై మంది వరకు గాయపడ్డారు. దీంతో కార్మికులు మరింత రెచ్చి పోయారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. యానాంలో పోలీసులు కేబుల్ ప్రసారాలు నిలిపేశారు.