సుప్రీంలో రామోజీ రావుకు చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత

శుక్రవారం, జనవరి  27, 2012, 15:44 [IST]
Ramoji rao
న్యూఢిల్లీ: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విశాఖపట్నం సీతమ్మధారలోని ఈనాడు దినపత్రిక కార్యాలయం స్థలం విషయంలో రామోజీరావు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తప్పుడు వివరాలతో దావా వేశారని సుప్రీంకోర్టు రామోజీరావుపై మండిపడింది. దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించినట్లు వార్తలు వచ్చాయి.

సీతమ్మధారలో ఈనాడుకు 9 వేల 200 గజలాల స్థలమే ఉందని రామోజీ రావు గతంలో దావా వేశారని, అయితే స్తల యజమాని వర్మ పోలీసు కేసు పెట్టారని ఓ ప్రముఖ మీడియా రాసింది. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రామోజీరావు తప్పుడు వివరాలతో పిటిషన్ వేశారని నిర్ధారించింది. తప్పుడు వివరాలను సవరించుకుంటానని రామోజీరావు సవరణ పిటిషన్ వేశారు. 11 వేల 200 చదరపు గజాల స్థలం ఉన్నట్లు తనకు ఇప్పుడే తెలిసిందని ఆయన కోర్టుకు వివరించారు దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.
English summary
Supreme Court has quashed Enaadu chairman Ramoji rao's review petition.
User Comments
Srsr Velagala 27 Jan 2012 08:26 pm
వీడు పరమ మాయగాడు. వీడికి విశాఖలో స్తలం పోతె వాడి బతుకు మల్లి పేపర్ పేపర్ అంటు రోడ్లమిద తిరిగి అమ్ముకోవలసి వచ్చే విదంగా మారతాదిక్, అందుకే ఆ స్తలాన్ని వదలకుండ కుటిల ప్రయత్నాలన్ని చేస్తున్నడు, ఆ స్తలమే పోయిన ఒక్క ఏడాదికి వీడి జాతకం ఎలా మారతాదో ప్రజలందరూ చూస్తారు.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets