రెండు నెలలుగా సునీల్ తప్పించుకుంటున్నాడు: సిబిఐ

శుక్రవారం, జనవరి  27, 2012, 13:51 [IST]
sunil reddy
హైదరాబాద్: రెండు నెలలుగా సునీల్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడని సిబిఐ తరఫు న్యాయవాది శుక్రవారం ప్రత్యేక కోర్టులో తెలిపారు. ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ ఇటీవల కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విచారణ జరిపిన కోర్టు సునీల్ రెడ్డిని మూడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది. తిరిగి సోమవారం ఉదయం ఆయనను తిరిగి కోర్టులో హాజరు పర్చాలని సిబిఐని ఆదేశించింది. ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు విచారణ జరపాలని తెలిపింది. ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో ఈ విచారణ కొనసాగాలని సూచించింది.

కాగా అంతకుముందు రెండు నెలలుగా సునీల్ తప్పించుకు తిరుగుతున్నారని, ఎమ్మార్‌లో అక్రమగా వసూలైన డబ్బులు ఎక్కడ దాచారో తెలుసుకునేందుకు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. సునీల్ రెడ్డి నుండి డబ్బు పొందిన అసలు వ్యక్తిని గుర్తించాల్సిన అవసరముందన్నారు. ఆ డబ్బు ఎక్కడ దాచారో సునీల్‌కు తెలుసునని చెప్పారు. ఛార్జీషీట్‌కు సమయం దగ్గర పడుతున్నందు వల్ల లోతుగా విచారించేందుకు సునీల్‌ను తమ కస్టడీకి ఇస్తే గుట్టు బయట పడుతుందన్నారు. అయితే సిబిఐ వాదనను సునీల్ తరఫు న్యాయవాది తప్పు పట్టారు. ఎమ్మార్ కేసులో రంగారావు, కోనేరు ప్రసాద్‌లను కాపాడేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే రంగారావు పేరును తొలగించారన్నారు. వారిద్దరూ సునీల్‌కు డబ్బులిచ్చారనడానికి ఆధారాలు లేవన్నారు. కాగా సునీల్ రెడ్డిని స్పెషల్ క్లాస్ ఖైదీగా గుర్తించాలని పిటిషన్ దాఖలు చేశారు.
English summary
CBI special court gave Sunil Reddy to CBI custody for three days, who was arrested in EMAAR case.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets