కాకినాడ/యానాం: రీజెన్సీ సిరామిక్ కంపెనీ తీరును నిరసిస్తూ కార్మికులు శుక్రవారం కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సుమారు వంద మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. కార్మిక నాయకుడు మురళీ మోహన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కొట్టడం వల్లే మురళీ మృతి చెందాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు కార్మికులు కంపెనీ కార్యాలయానికి, అక్కడే ఉన్న పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టారు. రీజెన్సీకి చెందిన విద్యాసంస్థలపై దాడులు చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత మురళి మృతిని నిరసిస్తూ కార్మికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తూ ముట్టడికి యత్నించారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. రీజెన్సీ ఆపరేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఇంటిపై కార్మికులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఆయనపై దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు.
కాగా రీజెన్సీ సిరామిక్ కంపెనీ విషయంపై అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ స్పందించారు. తన అనుచరుడైన మురళీ మోహన్‌ను పోలీసులే కొట్టి చంపారని ఆయన విమర్శించారు. రెండు రోజులుగా కొట్టడంతోనే అతను మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వైఖరే ఈ ఘటనకు కారణమన్నారు. పోలీసుల తీరు అమానుషంగా ఉందన్నారు. మృతి చెందిన కార్మికుడికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.