హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మహిధర్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. మే నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. 2001 జనాభా ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లను అమలు చేయడం వంటి అంశాల వల్లనే ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. రిజర్వేషన్ల సమాచారం త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మున్సిపాలిటీల్లో బిసి గణన పూర్తవుతుందన్నారు.
అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే కొత్తగా నలభై రెండు మున్సిపాలిటీలు ప్రకటించామని, మరో రెండు మూడు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. గ్రామ పంచాయితీల్లో కూడా బిసి గణన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. కాగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు ఇచ్చేది లేదని ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.