సిఎం ఐతే తొలి సంతకం, సోనియా మెప్పు కోసమే: జగన్

శుక్రవారం, జనవరి  27, 2012, 15:11 [IST]
YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రిని అయితే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం చెప్పారు. గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో వ్యాట్ పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ధర్నాకు దిగింది. ఆర్డీవో సూపరిండెంట్‌కు జగన్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వస్త్ర వ్యాపారంపై వ్యాట్ రద్దు పైనే తొలి సంతకం చేస్తానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు పొందేందుకే కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. వారికి ప్రజల దుస్థితి పట్టడం లేదన్నారు. వ్యాట్ పెంపు వల్ల ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.1400 పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి చేసే ఖర్చు రూ.700 కోట్లు అని ఆరోపించారు. జనవరికి, జూన్‌కు తేడా తెలియని వారు మన ఆర్థిక మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైందన్నారు.

వ్యాట్ రద్దుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యాట్ పెంపుతో లక్షన్నర దుకాణాలపై ప్రభావం పడుతోందన్నారు. దుకాణాలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాగే కొనసాగితే నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశముందన్నారు. పన్నుల రూపంలో దోచుకోవడమే ఈ సర్కారు లక్ష్యమని దుయ్యబట్టారు. వ్యాట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy promised that
User Comments
Kiran 28 Jan 2012 01:43 am
Boss first you give back the money you earned in your father regime then talk about other things. Other big joke is you your self declaring CM for party who has 1 MLA and MP is big loughing out loud. First you try to retian your 2 seats in 2014 elections.
Nitin Sri 03 Feb 2012 01:55 pm
well said brother kiran !
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets