మెల్బోర్న్: హోరాహోరీ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ నోవక్ జకోవిచ్ 2012 ఆస్టేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. రఫెల్ నాదల్‌పై ఆరు గంటల పాటు హోరాహోరీ పోరాటం చేశాడు. రఫెల్ నాదల్‌ను జకోవిచ్ 5-7, 6-4, 6-2, 6-7,7-5 స్కోరుతో ఓడించాడు. వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ విజయంతో జకోవిచ్ రికార్డు సాధించాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో అతి సుదీర్షమైన ఫైనల్ ఇదే. గత మూడేళ్లలో ఇంతటి ప్రమాణాలతో జరిగిన మ్యాచు లేదని అంటున్నారు. ప్రపంచ టెన్నిస్ యోధులు తలపడుతున్న సమయంలో బంతి బంతికీ ఉత్కంఠ చోటు చేసుకుంది. చివరి సెట్ రోమాంచితంగా సాగింది. వర్షం కారణంగా మ్యాచు కాస్తా ఆలస్యంగా ప్రారంభమైంది.