మహబూబ్ నగర్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలడం ఖాయమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం అన్నారు. కోదండరామ్, నాగం, తెలంగాణ రాష్ట్ర సమితి నేత జూపల్లి కృష్ణా రావు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో కూలడం ఖాయమన్నారు. జెఏసి ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణ బస్సు యాత్రను చేపడతున్నట్లు చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే విగ్రహాల ధ్వంసం జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
బడ్జెట్ సమావేశాల తర్వాత కిరణ్ సర్కారు పడిపోవడం ఖాయమని నాగం జనార్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. టిడిపి తెలంగాణ ఫోరం ఓ అసమర్థ ఫోరం అని అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి ధరావత్తు కూడా దక్కదన్నారు. తెలంగాణ ద్రోహులకు ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు.