పార్టీల పేరుతో చిదంబరం దాటవేత: తెలంగాణపై నాగం

బుదవారం, ఫిబ్రవరి 1, 2012, 14:54 [IST]
Nagam Janardhan Reddy
హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలంగాణపై మంగళవారం కేంద్ర హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం వేరువేరుగా మండిపడ్డారు. చిదంబరం ప్రకటన బాధ్యతారాహిత్యమని కోదండరామ్ విమర్శించారు. కాంగ్రెసు పార్టీ మోసపూరిత విధానం వల్లనే తెలంగాణ రావడం లేదన్నారు. అమరుల స్ఫూర్తితో ఉద్యమం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ అమరవీరుల బలిదానాలకు కారణమైన రాజకీయ పార్టీల వైఖరిని ఎండగడతామన్నారు. తెలంగాణపై కాంగ్రెసు ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

చిదంబరం వ్యాఖ్యల్లో తెలంగాణ ఉద్యమం అణిచివేత ధోరణి కనిపిస్తోందని నాగం జనార్ధన్ రెడ్డి మహబూబ్ నగర్‌లో అన్నారు. తెలంగాణపై కేంద్రం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. దాటవేత ధోరణిలో భాగంగానే చిదంబరం ప్రతిసారి నాలుగు పార్టీల ప్రస్తావనను తీసుకు వస్తున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో స్పందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
English summary
Nagam Janardhan Reddy and Kodandaram blamed central minister Chidambaram for his statement about Telangana issue.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets