నాటి తప్పులకు చంద్రబాబుదే బాధ్యత: జగన్ పార్టీ నేత

శుక్రవారం, ఫిబ్రవరి 3, 2012, 8:54 [IST]
Konathala Ramakrishna
హైదరాబాద్: 2002లో జరిగిన తప్పులకు ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ గురువారం డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్ కేసుపై సిబిఐ ఛార్జీషీట్‌లో 2002లో జారీ అయిన ఓ జీవోకు సంబంధించి ఐఏఎస్‌లు విశ్వేశ్వర రావు, ఎల్‌వి సుబ్రహ్మణ్యం పేర్లను చేర్చిందన్నారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది కాబట్టి ఆయన దానికి బాధ్యత వహించాలన్నాలు.

ఆయన హయాంలో తప్పు జరిగితే పాపం అధికారులది, మంచి జరిగితే ఆయనది, తెలుగుదేశం ప్రభుత్వానిదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్ కేసులో బాబును మినహాయించి, 2004లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రధాన నిందితుల్లో చేర్చటం ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసిపోయాయనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. కొందరి గుప్పిట్లో ఉండిపోయిన సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
English summary
YSR Congress Party leader Konathala Ramakrishna accused that TDP chief Nara Chandrababu Naidu is responsible for EMAAR.
User Comments
Ramanasree 03 Feb 2012 11:05 am
ఇదే దౌర్భగ్యం. చంద్రబాబు తర్వాత 6 సంవత్సరాలు మీ రాజన్న రాష్ట్రాన్ని పరిపాంచాడు. చంద్రబాబు బొక్కితే మీరేంచేశారూ కొణతాల గారూ? ఆ రాజన్నతో బాటూ మీరూ ఓ ముఖ్యమైన మంత్రే.ఆహా బావుందీ అదే దార్లో పడి మేసి వాడి మీద తోశేసి మనం బొక్కుదామని చేసిన పనేగదా యిది. ఇప్పుడు ఆ పిటిషన్ లో తారీఖు 2005 వుండేడప్పటికి మూకు సానుకూలంగా మాట్లడతారా? వేలకు వేల కోట్లు బొక్కేసిన ఆ ఆలీబాబాను మీరి సమర్ధించడలో ఆంతర్యం.... తిరుమలేశా నువ్వే దారి!
telugu babu 03 Feb 2012 09:26 am
tappu chesina kooda sigguseram lekunda baditeginchi matlaadi samasyani divert cheyyatam meeandariki yesureddy baane training ichaadu.Emmaar CBN time lo vachindani andariki telusu,vachina golantha change in GO and distribution of asets illegally which was happened after 2005.Nuvvu okappati manthri settlements chesukovatam,devudi sommu tinatam,murders cheyinchatam tappa neeku mee nayakudiki em telusu?Asalu meevaadu inak jail ki vellaledante inka doubt,mundara vellalsindi vaadu,aa kvp gaadu.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets