జగన్ కేసుతో సంబంధం లేదు: మాజీ సిఎస్ రమాకాంత్

శుక్రవారం, ఫిబ్రవరి 3, 2012, 9:12 [IST]
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి గురువారం స్పష్టం చేశారు. మధ్యాహ్నం సిబిఐ ఎదుట హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కేసుకు తన విచారణకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన హయాంలోని జివోలపై సిబిఐ అనుమానాలను నివృత్తి చేశానని చెప్పారు. దర్యాఫ్తు అధికారులకు అనుమానమున్న ప్రతి ఫైలు ముందుంచి అడగటం వల్ల ఆరున్నర గంటల సమయం పట్టిందన్నారు.

రమాకాంత్ రెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎదుట హాజరయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన హయాంలో జారీ చేసిన జివోలపై ఆయనను సిబిఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. దిల్ కుషా అతిథి గృహంలో ఆయనను సిబిఐ విచారించింది. సుమారు ఆరున్నర గంటల పాటు ఆయనతో సిబిఐ మాట్లాడింది. కాగా జగన్ ఆస్తుల కేసులో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా కూడా గురువారం సిబిఐ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆయనను అధికారులు రెండు గంటల పాటు విచారించారు.
English summary
Former government CS Ramakanth Reddy said that he has no link with YSR Congress Party chief YS Jaganmohan Reddy case.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets